బిల్డింగ్ పైనుంచి పడి బాలుడి మృతి
దుండిగల్(సికింద్రాబాద్) : ఐదంతస్థుల భవనం మీద తమ్ముడితో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దుండిగల్ ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.