బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 300 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు 

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూస్తాం

టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 28  :::::

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని చెందిన 300 మంది యూత్ కాంగ్రెస్ యువత నాయకులు  చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని చెందిన 100 మంది యూత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సేల్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ , పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో చింతా ప్రభాకర్  గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే

బీఆర్ఎస్ యూత్ నాయకులు శ్రావణ్ రెడ్డి ,కసిని శ్రీకాంత్ , విష్ణు అధ్వర్యంలో 200 మంది యువత నాయకులు బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు .

పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్  వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చింతా ప్రభాకర్ అధ్వర్యంలో పనిచేయడానకి బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు.

గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో  పనిచేసిన కనీసం గౌరవం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చింత ప్రభాకర్ ఆదరణ , ఆప్యాయత చూసి పార్టీలో చేరడం జరిగిందన్నారు .

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చింతా ప్రభాకర్ గెలుపుకు శయ శక్తుల కృషిచేసి చింతా ప్రభాకర్ గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని సూచించారు. అలాగే యువత నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

వాళ్లు ఎన్నుకున్న ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా  అలాంటి నాయకులు మాకొద్దని నిరంతరం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పడం సంతోషం అన్నారు.

కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు , నర్సింలు, CDC చైర్మెన్ కసాల బుచ్చిరెడ్డి , మాజీ CDC చైర్మెన్ విజేందర్ రెడ్డి ,నక్క నాగరాజ్ గౌడ్ , రషీద్ , సొహెల్ , శ్రీకాంత్, విఠల్ , మసూద్ , తదితరులు పాల్గొన్నారు.