బీజేపీ,బీఆరఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం

` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
` అభివద్ది చేస్తున్నాం..ఇంకా చేసి చూపిస్తాం
` మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే
` వికారాబాద్, పరిగి, తాండూర్‌లకు గోదావరి నీళ్లు పారిస్తాం
` కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరంగా మారింది
` దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన చరిత్ర దాగదు
` బీజేపీ, బిఆరఎస్ కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టండి
` వికారబాద్ జిల్లా పర్యటనలో సిఎం రేవంత్ పిలుపు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది మళ్లీ కాంగ్రెస్ పార్టీయేనని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విÖరిచ్చిన అధికారంతో అభివద్ది పనులు చేస్తున్నామని అంటూ..వికారాబాద్, తండూర్, పరిగి ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తామని అన్నారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబే సాక్ష్యం అంటూ హావిÖ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన`ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ తన స్వార్థం కోసం అటకెక్కించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీల గోదావరి జలాలను అందిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవేనని, కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల జిల్లా రైతాంగం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే ’కూలేశ్వరం’గా మారిందని, ఆ ప్రాజెక్టు నిధులతో ఆయన కుటుంబ సభ్యులు ఫామ్ హౌసులు కట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. తాండూరు, పరిగి , వికారాబాద్ ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా హావిÖ ఇచ్చారు.స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్ప్పులను, తప్ప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్టానికి చేసిందేవిÖ లేదని విమర్శించిన ఆయన, బీజేపీ , బీఆరఎస్ పార్టీల మధ్య ’చీకటి ఒప్పందాలు’ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ`ఫామ్‌లను బీఆరఎస్ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు. జిల్లా అభివద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. లక్క్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. మక్తల్, నారాయణపేట , కొడంగల్ నియోజకవర్గాలకు కష్ణా జలాలను తరలించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టానికి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిలే బాధ్యులని విమర్శించిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం కోర్టు కేసులను పరిష్కరించి ఆ రోడ్డు పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్డు , రేడియల్ రోడ్లు రాబోతున్నాయని, వికారాబాద్ త్వరలోనే ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చరిత్రను తాను చెరిపేయాలని చూస్తున్నానని కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర, దొంగ నోట్ల వ్యవహారం , దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హావిÖల చరిత్ర తెలంగాణ ఉన్నంత కాలం చెరిగిపోదని, ఆ ’పాపాల భైరవుడి’ చరిత్ర ప్రజలకు గుర్తుండేలా చేసే బాధ్యత తనదని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి హావిÖలను అమలు చేశామని గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విషం చిమ్మే పాములకు మళ్ళీ పాలు పోయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివద్ధి కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివద్ధి కొనసాగిస్తున్నాం. అప్ప్పులున్నా.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ, చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికాల్ బంధంతో భాజపా, బీఆరఎస్ పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయి. బీఆరఎస్‌ను ప్రజలు బొందపెట్టారు. కాంగ్రెస్‌తో పోరాడటం మావల్ల కాదని భాజపాతో బీఆరఎస్ కలిసిపోయింది. భాజపా అభ్యర్థుల బీఫామ్‌లు బీఆరఎస్ పార్టీలో ఇచ్చే దుస్థితి ఏర్పడింది. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆరఎస్, భాజపా ప్రయత్నించలేదు. ప్రధాని మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. పదేళ్లలో సమస్యలు పరిష్కరించి ఉంటే బీఆరఎస్, భాజపా నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అడగకుండానే ప్రజలు ఓటేసేవారు. ఓట్లు కావాలి కానీ, ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? ప్రాణహిత ` చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.38వేల కోట్లతో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్ప్పుకొని కేసీఆర్.. రంగారెడ్డి జిల్లాలకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది అని సీఎం హావిÖ ఇచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్లకుంట్ల కిషన్ రావు గుర్తు పెట్టుకోండి తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐదేండ్ల కోసం ఎన్నికైనం.. మరో ఐదేళ్లు పదవిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు పవర్‌లో ఉన్న బీఆరఎస్.. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడు మన సమస్యలని పట్టించుకోలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే బీఆరఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని.. అభివద్ధి పనులకు కాళ్లల్లో క్టటెలు పెడుతున్నాయని విమర్శించారు. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో పెళ్లాంమొగుళ్ల మాటలు కుడా విన్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక పనులు, తప్ప్పులు చేస్తే నోటీసులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. దళితలను సీఎం చేస్తానన్న విÖ చరిత్రను నేనేలా తూడ్చుతానని.. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొఖం చెల్లకే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని సూచించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు స్థానిక నేతలు సభలో పాల్గొన్నారు.