*బీజేపీ నాయకుడు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలి*

   బిఎస్పి అలంపూర్ ఇంచార్జి మహేష్
అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 18) చాకలి ఐలమ్మ,  పోరాటాలను కించపరుస్తూ  మాట్లాడిన బిజెపి నాయకుడు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని  ఆదివారం అలంపూర్ బీఎస్పీ ఇంచార్జి  అధ్యక్షులు బి మహేష్  అన్నారు. అలంపూర్ పట్టణం లో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మహేష్  మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,రజాకారులను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అన్నారు.బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఇటీవల రజాకారులపై వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారని,ఒకవైపు భారత మాతాకీ జై అంటూ మరోవైపు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ  పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని,  రాష్ట్రంలోని రజకుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందడానికి బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని తక్షణమే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు బిజెపి నాయకులు రజకులకు బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రజకులతో కలిసి భవిష్యత్ పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు బి మహేష్ ఉపాధ్యక్షులు యామని సుంకన్న,మద్దిలేటి,సురేష్,బిసన్న,నాసిర్
 తదితరులు పాల్గొన్నారు