బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కట్టరవీందర్, జిల్లా పంచాయితీ సెల్ కన్వినర్ పాకాల రాములుగౌడ్ ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు యాబై మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బారతీయ జనతాపార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలపారు. ఈ సమావేశంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు జిట్టవేని అంజిబాబు, మండల ప్రధాన కార్యదర్శి గంట్ల రవీందర్‌రెడ్డి, అక్కపల్లి తిరుపతి చారి, మండల ఉపాద్యక్షుడు గజ్జెల మల్లయ్య, రాజు, రాయమల్లు, శ్రీకాంత్‌రెడ్డి, శంకర్, విద్యాసాగర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.