బీజేవైఎం ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ స్టేషన్ ఘన్పూర్, జూన్ 08, ( జనం సాక్షి ), భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఎనిమిది సంవత్స రాల సేవా సుపరిపాలన కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం డివిజ న్ కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్,బిజెపి మండ ల అధ్యక్షులు గట్టు కృష్ణ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం,బిజెపి జనగామజిల్లా సీనియ ర్ నాయకులు ఐలోని అంజి రెడ్డి హాజరై ఈ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వికాస్ తీర్థ బైక్ ర్యాలీ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయ కులు ఇనుగాల కార్తిక్ రెడ్డి, బీజేవైఎం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్,బీజేవైఎం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు పన్నీరు అశోక్,బీజేవైఎం జన గామ జిల్లాఅధికారప్రతినిధి నవీన్ రెడ్డి,బీజేవైఎం జనగామ జిల్లా కార్యదర్శి మహేష్, బీజేవైఎం జన గామ జిల్లాకార్యవర్గ సభ్యులు సూర్య తేజ, బీజే వైఎం జనగామ జిల్లా సీనియర్ నాయకులు పులి శ్రవణ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ కిరణ్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఒగ్గు రాకే ష్, బీజేవైఎం మండల నాయకులు మణి,బిజెపి బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు మండల నాయకులు, మోర్చా జిల్లా నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు*
*దేశంలో లో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి*
*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి*
*రేగొండ మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన*
జనం సాక్షి, రేగొండ : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నిజం పల్లి, గోరి కొత్తపల్లి,  వెంకటేశ్వర్లపల్లి, జగ్గయ్యపేట గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి, పల్లె ప్రగతి ఇ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఊరు మన బడి ఈ కార్యక్రమం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.8 ఏండ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం  ఎంతో అభివృద్ధి చెందింద‌న్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు లబ్ధిపొందేలా పథకాలు అమలు చేస్తుందని చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌, ఆసరా పింఛన్‌, హరితహారం,మన ఊరు- మన బడి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆసర పథకం అండగా నిలుస్తోంద‌ని, వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించామని, త్వ‌ర‌లో వారికి ఫించ‌న్లు అంద‌జేస్తామ‌ని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో క‌రెంట్, తాగు, సాగునీటి స‌మ‌స్య లేద‌న్నారు. స్వంత స్థ‌లంలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకునే వారికికి  ప్ర‌భుత్వం రూ. 3 ల‌క్ష‌లు  ఆర్థిక స‌హాయం అంద‌జేస్తుంద‌న్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జెడ్ పి టి సి సాయి విజయ ముత్యం, మండల స్పెషల్ ఆఫీసర్ శామ్యూల్, ఎంపీడీవో సురేందర్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, టిఆర్ఎస్ గోరి కొత్తపల్లి,రేగొండ మండల అధ్యక్షులు మటిక సంతోష్, అంకం రాజేందర్, కొడవటంచ ఆలయ కమిటీ చైర్మన్ హింగే మహేందర్, జడ్పి కోఆప్షన్ సభ్యులు రహీం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి, పి. ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ సామల పాపి రెడ్డి,
 సర్పంచులు మరెళ్ళ ఇంద్ర బాపిరెడ్డి, సుధన బోయిన రజిత రాజయ్య, చిగురు మామిడి రజిత రాజు, పాత పెళ్లి సంతోష్, ఎంపిటిసిలు సందెల స్వప్న రాంబాబు, హమీద్, గండు కుమార స్వామి, దుగ్యాల సునీత రాజేశ్వర్ రావు, కేసి రెడ్డి ప్రతాప్ రెడ్డి, నాయకులు మైసా బిక్షపతి, రవి సామ్రాట్, రజినీకాంత్, రఘు సల తిరుపతి,బైకని సదానందం, అమ్ముల రాజయ్య, అమ్ముల సదన్న, పట్టెం శంకర్, కొలపాక బిక్షపతి, జూపాక నిలబ్రం, బండి కిరణ్, మర బోయిన దనుంజయ్య, బలే రావు మనోహర్ రావు, కట్ల చిన్ని, నిమ్మల రాజు ఆయా గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.