బీడీఎల్‌ లో ప్రమాదం

3

-బాధితులను పరామర్శించి డెప్యూటీ సీఎం

హైదరాబాద్‌ 13 జూన్‌ (జనంసాక్షి)

కాంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)లో శనివారం భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సంస్థలోని వ్యర్థ పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నవీన్‌ పూర్తిగా కాలిపోగా… రజాక్‌, సునీల్‌ పాల్‌, ఎం.ఎ వాబ్‌, గోపాలరావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కాంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ పరామర్శించారు. డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. వారికి మెరుగైన వైద్యమందించాలని డాక్టర్లకు సూచించారు. గాయపడ్డ ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.