బీడీ కార్మికులకు ఆసరా

5
వచ్చేనెల నుంచి 1000రూపాయల పెన్షన్‌

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జనవరి24(జనంసాక్షి)-

ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో వచ్చే నెల నుంచి బీడీ కార్మికులకు ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. విధివిధానాలను వెంటనే రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీడీ కార్మికులు గణనీయంగా ఉన్నారు. మెట్ట ప్రాంతాల్లోని మహిళలు ఇదే వృత్తిని జీవనోపాధిగా మలుచుకుని జీవిస్తున్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి అదనంగా ఈ 1000రూపాయలు ఇవ్వనున్నట్లు నిజామాబాద్‌ ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.