బీపీ మండల్ పోరాట స్పూర్తితో ముందుకెళ్తాం
– బీపీ మండల్ జన్మస్థల సందర్శన మా అదృష్టంగా బావిస్తున్నా.. – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌జనం సాక్షి , మంథని :బీసీ సమాజహితం కోసం బీసీ కమీషన్ చైర్మన్‌గా బీపీ మండల్ చేసిన పోరాట స్పూర్తితోనే ముందుకెళ్తామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. బీహర్ రాష్ట్రంలోని పాట్నా అసెంబ్లీ, రాజ్‌భవన్ దగ్గర ఏర్పాటు చేసిన బీపీ మండల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఆయన బీపీ మండల్ జన్మస్థలమైన మురో గ్రామంలోని వారి ఇంటిని సందర్శించిన అనంతరం బీపీ మండల్ మనుమడు అనంద్ మండల్‌తో కలిసి బీపీ మండల్ సమాధిని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే బీపీ మండల్ పోరాటం, ఆయన ఆశయాలకు సంబంధించిన పూర్తి వివరాలను అనంద్ మండల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. బీసీల చైతన్యం కోసం మంథని నియోజకవర్గంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆనాడే బీసీ సమాజం కోసం బీసీ కమిషన్ చైర్మన్‌గా బీపీ మండల్ పోరాటం చేశారని, జనాభా దామాషా ప్రకారం బీసీలు సమాజంలో ఎంత శాతం ఉన్నారో అన్ని రంగాలలో వారికి అంతేవాటా అంటూ బీసి సమాజానికి 52 శాతం రిజర్వేషన్ సాధించడం కోసం ఆయన చేసిన కృషి, పోరాటం మరువ లేనిదన్నారు. ఆనాడే బీసీల పట్ల ఆయనకు ఎంత ప్రేమ భాధ్యత ఉందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం ఆయన పోరాటంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నాడని, అయినా వెనుకడుగు వేయకుండా తమ పోరాటం కొనసాగించారని ఆయన గుర్తు చేశారు. ఈనాడు విద్య, ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజ్వేషన్‌లు బీపీ మండల్ పోరాట ఫలితమేనని ఆయన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన 340 ఆర్టికల్ ప్రకారం బీపీ మండల్ పోరాట ఫలితమేనని ఆయన వివరించారు. బీసీ సమాజం రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అబివృద్ధి సాధించాలని ఆనాడే బీపీ మండల్ గొప్పగా ఆలోచన చేశారని, అలాంటి మహనీయుడి చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీపీ మండల్ ఆశయాలను నెరవేర్చడానికి బీసీలంతా ఒక్కటి కావాలని, ఆ దిశగానే తాను అడుగులు వేస్తున్నానని తెలిపారు. బీసీల్లో ఐక్యత లేకపోతే బీసీ సమాజం చాల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఎంతో నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గ భవిష్యత్ కోసం ఆనాడే బీపీ మండల్ చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను తెలుసుకుని బీసీ సమాజాన్ని మెల్కొల్పాలనే ఆలోచనతో తాను బీపీ మండల్ జన్మస్థలం సందర్శించి వారి కుటుంబ సభ్యులను కలిసి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. బీపీ మండల్ ఆశయాల సాధనలో తన వంతు పాత్ర పోషించి ఆయన కోరుకున్న సమాజాన్ని నిర్మిస్తామని తెలిపారు. బీపీ మండల్ జన్మ స్థల సందర్శన నా అదృష్టంగా బావిస్తున్నానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్ వెంట బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు కె యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్‌లాల్, మంథని మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్ యాదవ్‌తో పాటు తదితరులు ఉన్నారు.