బీవీఆర్ ఐటీ క‌ళాశాల విద్యార్థుల ప్ర‌తిభ

అభినందించిన ప్రిన్సిపాల్
న‌ర్సాపూర్‌.  సెప్టెంబర్, 15,   ( జనం సాక్షి ) :
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్  ఆధ్వర్యంలో బీఐటీ  వెల్లూరులో 9-11 సెప్టెంబర్ 2022 లో నిర్వహించిన జాతీయ స్థాయి విద్యార్థుల సదస్సులో  నర్సాపూర్ బీవీఆర్ ఐటీ  కళాశాలకు చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. యు. అప్పల నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు సంజన, లిఖిత, గోపి ,తేజ త‌దిత‌ర విద్యార్థులు  వ్యర్థ పదార్థాల నుండి పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీ  అనే పరిశోధన అంశం మీద మాట్లాడి రెండవ బహుమతి సాధించారు. వ్యర్థపదార్థాల పునర్వినియోగం ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు అనేది ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశమ‌ని క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ల‌క్ష్మి ప్ర‌సాద్ తెలిపారు.  విద్యార్థుల  పరిశోధనకు సహకరించిన డిపార్ట్మెంట్ హెవోడి  ప్రొఫెసర్ డా.జిబి . రాధికకు  ప్ర‌న్సిపాల్ డా. లక్ష్మీప్రసాద్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.   ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి  సదస్సులలో పాల్గొని విజయం సాధించాలని కోరారు.
==============================
ఫోటోరైట‌ప్‌, ఎన్ ఎస్ పి 1 ద్వితీయ బ‌హుమ‌తి సాధించిన విద్యార్థులు