బీసీలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉన్నారు

-వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
– బిసి చౌక్ పుస్తకావిష్కరణ
వరంగల్ ఈస్ట్, జూలై   (జనం సాక్షి)
 జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉన్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే  నన్నపనేని నరేందర్ అన్నారు. సోమవారం ప్రముఖ కవి రచయిత డాక్టర్ చింతం ప్రవీణ్ వ్రాసిన  బిసి చౌక్ పుస్తకాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే నన్నపనేని మాట్లాడుతూశ్రామిక కులాలుగా సమాజాసేవలో వున్న బిసి లు  పై రావాల్సినంత సాహిత్యం రాలేదని అన్నారు. బిసి సమాజం కోసం అనేక ఏళ్ల నుండి సాహిత్యం ,బిసి అస్తిత్వం కోసం పోరాడుతున్న చింతం ప్రవీణ్ బిసి ల జీవితాలను సాహిత్యం లో సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం వుందని నన్నపనేని అన్నారు.కవి రచయిత బిసి ఉద్యమ నాయకుడు బిసి చౌక్ పుస్తక రచయిత డాక్టర్ చింతం ప్రవీణ్ మాట్లాడుతూ బిసి కవులు బిసి సాహిత్యం పై ముందుకు కదులుచున్నారని అన్నారు.రాజకీయాల కతీతంగా బిసి లు ఒక్కటైనప్పుడే బిసిలు రాజ్యాధికారం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో   మార్కెట్ కమిటీ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి, కార్పొరేటట్లు సోమిశెట్టి ప్రవీణ్, భోగి సురేష్, సామాజిక వేత్త సోమరామ మూర్తి, నలిగంటి చంద్రమౌళి, నాగబెల్లి జితేందర్ సామ్రాట్ రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.
Attachments area