బీసీ డిక్లరేషన్‌.. కామరెడ్డిలో విజయోత్సవ సభ

` 2 లక్షల మందికి తరలించాలని వ్యూహం
` ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాం: మంత్రి పొంగులేటి
` ప్రతిపక్షాల భరతం పట్టేందుకు బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ
` బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా కామారెడ్డి సభ
` మోదీ అమిత్‌ షా కు కనువిప్పు కలిగేలా కామారెడ్డి సభ
` దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు
` బీసీల గురించి బండి సంజయ్‌, అర్వింద్‌ ఎందుకు మాట్లాడట్లేదు?
` బిజేపి నేతల మాదిరి ఓట్లు అడుక్కోలే
` లిక్కర్‌ రాణిగా నిజామాబాద్‌కి కవిత చెడ్డ పేరు తీసుకొచ్చారు
` వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసిఆర్‌ కుటుంబంలో కొట్లాట
కామారెడ్డి ప్రతినిధి(జనంసాక్షి):ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ సభను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.రెండు లక్షల మందితో బీసీ సభను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభను కామారెడ్డిలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఆ సభకు పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించనుంది.దీనిలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందన్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘ కామారెడ్డిలో భారీ వర్షం పడి చాలా నష్టం జరిగింది. దేశంలోని ఏ వర్గం వారు ఎంత ఉంటే అంత శాతం ఫలాలు పొందాలి. అదే నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. అందుకే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిల భరతం పట్టడానికి కామారెడ్డిలో బీసీ సభను పెడుతున్నాం. బండి సంజయ్‌ లేచిన మొదలు ఆలయాలు చుట్టూ తిరుగుతూ ఓట్లు అడుక్కుంటున్నారు.బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ బిల్లును సాధించుకుంటాం. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ సాధించుకుంటాం. బండి సంజయ్‌ ఒక దేశ్‌ముఖ్‌ల వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ సెక్యూరిటీ లేకుండా తిరుగు.. నేను సెక్యూరిటీ లేకుండా తిరిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఈనెల 15న జరిగే సభ ద్వారా బీజేపీ దొంగ ఆట కట్టిస్తాం. అరవింద్‌ ఒక్కసారి అయినా బీసీల గురించి మాట్లాడలేదు. బండి సంజయ్‌.. బీసీ బిల్లును మోదీ కాళలు పట్టుకుని ఆమోదింపజేసే సత్తా ఉందా?, మోదీ టెక్నికల్‌గా బీసీ.. కానీ బీసీలపై ప్రేమ లేదు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది. బీసీ జీవితాలను మలుపు తిప్పే సభ కామారెడ్డిలో జరగబోతుంది’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాల భరతం పట్టేందుకు బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ : మహేష్‌ కుమార్‌ గౌడ్‌
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాల భరతం పట్టే వేదికగా ఈ సభ నిలుస్తుందని స్పష్టం చేశారు.బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి సభ ద్వారా కేంద్రం దిగి రాక తప్పదని ఆయన హెచ్చరించారు. మోదీ, అమిత్‌ షాలకు కనువిప్పు కలిగించేలా ఈ సభ జరగబోతోందని పేర్కొన్నారు.బీజేపీ నేతలు ‘‘దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్ళ్లా మారిపోయారు. బండి సంజయ్‌ ఉదయం లేస్తే దేవుళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడుగుతారు. దేశ్‌ ముఖ్‌ మాటకు కట్టుబడి ఉన్నాను.సెక్యూరిటీ లేకుండా రావడానికి దమ్ముందా? బీసీ రిజర్వేషన్లపై దొంగాట ఆడుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ ముఖం చాటేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.బీఆర్‌ఎస్‌పై కూడా తీవ్ర స్థాయిలో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. ‘‘కవిత లిక్కర్‌ రాణిగా నిజామాబాద్‌కు చెడ్డపేరు తెచ్చారు. కేసీఆర్‌ కుటుంబం అంతా దొంగల ముఠా. రాష్ట్రాన్ని దోచుకున్నామని కవిత స్వయంగా అంగీకరించటం హర్షణీయమని, కానీ ఐదేళ్ళ ముందే చెబితే సన్మానించేవాళ్లం’’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని తేల్చి చెప్పారు. దోచుకున్న సొమ్ములో వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసిఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు అని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ పార్టీ సమానత్వానికి మారు పేరు అని టీపిసిసి చీఫ్‌ పేర్కొన్నారు. ‘‘కార్యకర్తల కృషివల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్‌ గాంధీ ఆశయమైన ఎవరు ఎంతో వారి వాటా వారికంత నినాదానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఊపిరి పోశారు’’ అని తెలిపారు. కుల సర్వేలో 56.33 శాతం బీసీలు ఉన్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ షెట్కర్‌, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
బీసీల గురించి బండి సంజయ్‌, అర్వింద్‌ ఎందుకు మాట్లాడట్లేదు?
కామారెడ్డి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుకాకుండా భాజపా అడ్డుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. ఆ పార్టీ ఎప్పుడూ మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయాం చేస్తోందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన సన్నహాక సమావేశంలో మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు.‘’కామారెడ్డి గడ్డమీద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాం. హామీ ప్రకారం మూడు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ రిజర్వేషన్లను భాజపా అడ్డుకుంటోంది. బీసీల గురించి బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌ ఎందుకు మాట్లాడటం లేదు?అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా రావడంతో కవిత బయటపెట్టింది. ఇదే విషయం ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే కవితను ప్రజలు నమ్మేవారు’’అని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.