బీసీ వసతి గృహాల్లో మెస్ చార్జీలను పెంచాలి.

కళాశాల బీసీ వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలు ఇవ్వాలి.
బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై27(జనంసాక్షి):
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా బీసీ వసతి గృహాల్లో మెస్ చార్జీలను పెంచాలని, అదేవిధంగా కళాశాల బీసీ వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలను ఇవ్వాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహాన్ని బుధవారం బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి సందర్శించారు. దీనిలో భాగంగా అక్కడి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.అనంతరం వసతి గృహ వసతుల పైన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బడ్జెట్ ను విడుదల చేయాలని, అలాగే కళాశాల బాలికలకు కాస్మెటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యవసర సరకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని అన్నారు.అలాగే బీసీ వసతి గృహ విద్యార్థులకు పెన్నులు,నోట్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన వసతి గృహ భవనాలను వసతులతో నిర్మించాలని దీని వలన ప్రభుత్వ బీసీ వసతి గృహాలకు విద్యార్థుల శాతం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతి గృహ కళాశాల విద్యార్థినులు ఇందు. అంకిత. ఝాన్సీ. శిరీష. అనిత. వైష్ణవి. భార్గవి. తులసి మరియు వార్డెన్ తరంగిణి. వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.