బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతిపత్రం బీసీ సంక్షేమ యువజన విభాగం జనగామ జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్

జనగామ( జనం సాక్షి) రఘునాథపల్లి, జూలై27: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రఘునాథ పల్లి ఎమ్మార్వో కు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయం నివాసం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదనంతరం బీసీ సంక్షేమ యువజన విభాగం జనగామ జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వి ఆర్ ఏ ధర్నా కారణంగా కులం ఆదాయం నివాసం సర్టిఫికెట్ ల జారీ నిలిచిపోయింది సమ్మె వలన విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు కార్యాలయ సిబ్బంది ని సంప్రదిస్తే వి ఆర్ ఎ ల సమ్మె వలన జాప్యం జరిగిందని నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు కావున దయచేసి కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్ల జారీలను వేగవంతంగా అయ్యేటట్లు చేయాలని కోరుచున్నాము ఈ సమ్మే కారణంగా విద్యార్థులు నష్టపోకూడదు అన్నారు దీనిపై ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల బీసీ యువజన సంఘం ఇంచార్జ్ చింతకింది హరీష్ బీసీ నాయకులు రాజు కర్ణాకర్ గోపి మహేష్ విజయ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు