బుగ్గ జాతర ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నవంబర్ 8వ తేదీ నుంచి 23 వరకు జరిగే బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక మాస స్నానోత్సవాల జాతర పనులను పరిశీలించిన గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగే జాతర కాబట్టి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో నీటి ప్రవాహం ఎక్కువ వుండడంతో భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనుగుణంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, ప్రజలు కూడా అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు, అదేవిధంగా ఈ వారంలో బుగ్గ జాతర నిర్వహణ కోసం వివిధ శాఖ అధికారులతో, మరియు ప్రజాప్రతినిధులతో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, కార్యదర్శి వెంకటేశం , వార్డు సభ్యులు చీమర్ల గాలమ్మా, మంద మోహన్ రెడ్డి, మానుపాటీ వెంకటేష్, కొండూరు మల్లేశ్, రావుల భాష, ఎన్నిదుల సురేష్, మెగవత్ లచ్చిరాం, గుడ్డిమల్ల చంద్రయ్య, శ్రీదరచర్యులు, జంగచారీ, యాదగిరి రెడ్డి, మార లక్ష్మణ్, నూకం సుధాకర్, బుగ్గరాములు, జంగయ్య, శ్రీనివాస్, వడ్ల ఆంజనేయులు, శంకర చారి, వెంకట చారి, జగన్నాధం, శంకరయ్య, నరేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.