బుధవారం వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపుతూ అన్నారు.

మధిర నియోజకవర్గంఖమ్మం జిల్లా చింతకాని మండలం కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయము ముందు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్న మూడో రోజు నిరవధిక సమ్మె ను వీఆర్ఏలు కొనసాగిస్తుండగా వారి న్యాయమైన కోర్కెలను, డిమాండ్లను త్వరలోనే పరిష్కారం అవుతాయని చింతకాని మండల తహసిల్దార్ మంగీలాల్ బుధవారం వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపుతూ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ అరుణ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉష రాణి. సత్యవతి జూనియర్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.