బేతని అనాధ బాల బాలికల ఆశ్రమానికి సరుకులు పంపిణి
శివ్వంపేట అక్టోబర్ 18 జనంసాక్షి : మండల పరిధిలోని మగ్దుంపూర్ గ్రామ శివారులో ఉన్న బేతని అనాధ బాల బాలికల ఆశ్రమానికి ఎచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ జనరల్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ మేనేజర్ రవీంద్ర చేతుల మీదుగా 22 వేల రూపాయల నిత్యావసర సరుకులను బేతని సంరక్షణ ఆశ్రమ నిర్వాహకులకు మంగళవారం వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ అనాధ శరణాలయాలకు తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో చిన్నపాటి సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. అనాథ పిల్లల సంరక్షణకు సహాయ సహకారాలను అందిస్తున్న ఎచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.