బైక్ ర్యాలీ కి వెళ్తే అరెస్టుల!
రామారెడ్డి 6జూన్ జనంసాక్షీ
బైక్ ర్యాలీ కి వెళ్తే పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని బీజేవైఎం రామారెడ్డి మండల అధ్యక్షులు నాయకులు ఇసాయిపేట నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఎం నరేంద్ర మోడీ విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం తన కృషితో 8 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బైక్ ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులు ముందస్తుగా బైక్ ర్యాలీ తీయకుండా అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని స్పష్టంగా చెప్పారు. అరెస్టై నవారిలో బీజేవైఎం మండల కార్యదర్శి గాండ్ల శ్రీకాంత్, బీజేవైఎం మండల కార్యవర్గసభ్యులు కడెం శ్రీకర్