బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం జీడీకే 2వ బొగ్గుగనిపై ఏర్పాటుచేసిన ద్వారసమావే శానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడు తూ కార్మికులు పనిస్థలాల్లో సరైన వెంటిలేషన్‌ సౌక ర్యంలేక తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవు తున్నారని, గనులపై ఏర్పాటు చేసిన క్యాం టీన్‌లలో సరైన గ్రైండింగ్‌ మిషన్‌లు లేక టిఫిన్‌ సౌకర్యాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. వెంటనే ఈ సమస్యలన యాజమాన్యం పరిష్కరించి కార్మికులపై ఒత్తిడి తగ్గించి, యాక్టింగ్‌ చేయిచున్న కార్మికులకు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అదే విధంగా 2వ గని ఫిట్‌ కార్యాలయంను, 3వ గని ఫిట్‌ కార్యాలయంకు తరలించాలని కార్మికులకు సంబంధించిన సైకిల్‌మోటార్‌, పార్కింగ్‌ చేయుటకు యాజమాన్యం వెంటనే షెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు యాదగిరి సత్తయ్య, ఆర్‌కె.కేశవరెడ్డి, దేవ వెంకటేశం, కనకయ్య, గంగారాం, నర్సయ్య, సత్తయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు