బోధన్ రూరల్ సీఐగా గోవర్ధనగిరి

బోధన్, ఆగస్టు 18 ( జనంసాక్షి ) : బోధన్ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా జి. గోవర్ధన గిరి శుక్రవారం భాద్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ శ్రీనివాసరావు ఇసుక విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై విచారణ చేపట్టిన అధికారులు ఆయనతో పాటు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు ను సైతం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రానున్న పండుగలు దృష్టిలో పెట్టుకొని సీపీ కార్తికేయ బోధన్ రూరల్ సీఐగా గోవర్ధన గిరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలు రావడంతో పాటు ఇటీవల సర్కిల్ పరిధిలోని రెంజల్ మండలంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు సర్కిల్ కు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించేందుకు ఇక్కడ ఖాళీగా ఉన్న సీఐ పోస్టును అసికారులు ఎట్టకేలకు భర్తీ చేశారు. దాంతో నేడు సీఐగా గోవర్ధన్ గిరి భాద్యతలు స్వీకరించారు.
అవినీతిని తగ్గించి ఇసుక మాఫియా భారతం పడతా : సీఐ గోవర్ధన గిరి
బోధన్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అవినీతిని తగ్గించడంతో పాటు అక్రమ ఇసుక రవాణా దారులపై కఠిన చర్యలు తప్పవని సీఐ గోవర్ధన గిరి హెచ్చరించారు. బాధ్యతల అనంతరం జనంసాక్షి తో మాట్లాడుతూ, ప్రజల సమస్య పరిష్కారం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో అవినీతిని పూర్తిగా అరికట్టడం తో పాటు అక్రమ ఇసుక రవాణాకు అనుమతించే ప్రసక్తే లేదని సీఐ గోవర్ధన గిరి స్పష్టం చేశారు.