బోన్ క్యాన్సర్ పాయం లోకేష్ ని ఆదుకోండి

టేకులపల్లి, అక్టోబర్ 23( జనం సాక్షి ): మండల పరిధిలోని బోడు గ్రామానికి చెందిన పాయం గోపాల్ కుమారుడు లోకేష్ బోడు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. లోకేష్ కి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వెంటనే ఆపరేషన్ చేయకుంటే ప్రాణాపాయమని డాక్టర్లు తెలిపారు. దీంతో వెంటనే వైద్య ఖర్చులు నిమిత్తం చాలా ఖర్చు చేసి ఉన్నారు. కూలి పనులు చేసుకునే గోపాల్ కి ఆపరేషన్కు రెండు లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. తన కుమారుడిని రక్షించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని పలువురిని అభ్యర్థిస్తున్నాడు. బోన్ క్యాన్సర్ అని తెలపడంతో హైదరాబాదులోని ఎం ఎన్ జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుని ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యులు వెంటనే బోన్ సర్జరీ చేయాలని అందుకు రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్నారు.తను కూలి పనులు చేసుకునే పరిస్థితిలో ఉన్నానని, తన కుమారుని రక్షించుకునే స్తోమత లేనందున ఆర్థిక సాయం చేయాలని, తన కుమారుని ప్రాణాలను కాపాడాలని అభ్యర్థిస్తున్నాడు. ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు భయం గోపాల్ ఫోన్ నెంబర్ : 99 12889438 నెంబర్ కు ఫోన్ పే కానీ గూగుల్ పే గాని చేయగలరని అభ్యర్థిస్తున్నాడు. మానవతా దృక్పథంతో మనం చేసే చిన్న సహాయం ఓ చిన్నారి ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని స్పందించి ప్రతి ఒక్కరం తమ వంతు సహాయం చేద్దాం…