*బోరు బావులవద్ద జోరందుకున్న వరినాట్లు *గ్రామాల్లొ కూలీలు దొరకక ఇతర మండలాల నుండి కూలీల వలస
వర్షాకాలం ప్రారంభం తొలకరి జల్లులతో రైతుల్లో ఆనందం నింపిన వర్షాలు.ఆదివారం కురిసిన భారీవర్షానికి రైతుల్లో ఆశలు చిగురించాయి.దీంతో లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో పోల్కంపేట్ గ్రామంలొ రైతులు ముందే దుక్కిలు దున్ని పెట్టుకొని తుకాలు చల్లుకొని ఉన్న రైతులకు మొన్న పడ్డ భారీవర్షానికి బోర్లవద్ద వరినాట్లు వేస్తున్నారు.ప్రతిరోజు రాత్రి కాగానే వర్షం పడుతూ పొద్దంత గరువు ఇవ్వడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్న మవుతున్నారు.ఇలా వర్షాలు పడితే ఇటు వ్యవసాయదారులకు ఇతర వ్యాపారులకు అనువుగా ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.గ్రామాల్లో వరినాట్లు జోరందుకోవడంతొ రైతులకు కూలీలు దొరకక ఇతర మండలాల నుండి పక్క గ్రామాల నుండి కూలీలు వచ్చి వరినాట్లు వేస్తున్నారని రైతులు పేర్కొన్నారు.ఒక్కో ఆడకూలికి 500 తీసు కుంటున్నారని వారన్నారు.ఒకఎకరం వరిపొలం గుత్తాకు నాటువేస్తే 6 వేలరూపాయ లకు వరినాట్లు వేస్తున్నారని రైతులు తెలిపారు.ఏదేమైనప్పటికీ వర్షాల కారణంగా రైతులు అటు కూలీలు బిజీబిజీగా ఉంటూ చేతినిండా పనిఉందని కూలీలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.