బోర్నపెల్లి గోదావరి నది ఒడ్డున ఉన్న “కుర్రు” లో చిక్కుకున్న రైతులు

…సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ రవి, అధికారులు పరిశీలన

రాయికల్ మండలం బోర్నపల్లి (రెవెన్యూ) గోదావరి నది మద్యలో వున్న కుర్రు ప్రాంతంలో చిక్కుకున్నా 9 మందీ రెత్తులు.బోర్నపెల్లి గోదావరి తీర ప్రాంతమైన సంఘటనా స్థలాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి,అధికారులు పరిశీలించారు.కుర్రులో చిక్కుకున్న రైతులతో చరవాణిలో మాట్లాడి సహాయ చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు.బోర్నపెల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పత్తి నాటేందుకు గత పది రోజుల నుండి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.గోదావరి ప్రవాహం ఉధృతి పెరగడంతో కుర్రు (ఐలాండ్) ప్రాంతం నుండి బయటకు రాలేకపోతున్నారు.గోదావరి నీటి ప్రవాహంతో తమ ప్రాంతం కూడా నీట మునుగుతుందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.దీంతో రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు ఫోన్ ద్వారా సహాయక చర్యల కోసం సమాచారాన్ని అందించారు.బోర్నపెల్లి,చిట్యాల గ్రామాల చుట్టూ గోదావరి తీర ప్రాంతం ఉండడంతో కడెం మండలం చిట్యాల గ్రామ సమీపంలో కుర్రు ప్రాంతం దగ్గర కావడంతో తహసీల్దార్ దిలీప్ నాయక్,సీఐ కృష్ణకుమార్,అధికారులు ,ప్రజాప్రతినిధులు చిట్యాల గ్రామ ప్రాంతాన్ని సహాయ చర్యల కోసం పరిశీలించారు.