బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ఎటిఎంల వద్ద రద్దీ

న్యూఢిల్లీ,మే30(జ‌నం సాక్షి):  రెండురోజులపాటు  ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్‌ పాటిస్తున్న తరుణంలో మరోమారు ఎటిఎంల వద్ద రద్దీ పెరిగింది.  వేతన సవరణ డిమాండ్‌తో.. దేశమంతటా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెకు దిగారు.  ఉదయం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు?కొన్ని ప్రైవేటు బ్యాంకులు తెరుచుకోలేదు. ఆన్‌ లైన్‌ లావాదేవీలు యధావిధిగా జరుపుకోవచ్చని అధికారులు చెప్పారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వటంతో.. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకి దిగినట్లు తెలిపారు బ్యాంకు ఉద్యోగులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో 80వేల మంది అధికారులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దేశం మొత్తం 10 లక్షల మంది సమ్మెలో ఉన్నారు. అయితే నగదు కోసం ఎటిఎంల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. 4 నుంచి 15 శాతం వేతనాల పెంపును డిమాండ్‌ చేస్తోంది బ్యాంక్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌.  నష్టాల్లో ఉన్నందున.. ఆ స్థాయిలో పెంపు సాధ్యం కాదని ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. కేవలం రెండు శాతం మాత్రమే పెంచేందుకు అంగీకరించింది. చాలాసార్లు చర్చలు జరిగినా.. అసోసియేషన్‌ దిగిరాలేదు. దీంతో  21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంక్‌ ఉద్యోగులు ఈ సమ్మెకి దిగారు. రెండురోజులు బ్యాంకుల సమ్మె కారణంగా ం/ుఓ సెంటర్ల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ లావాదేవీలు చేసే.. వ్యాపారులు ఏటీఎం సెంట కు వస్తున్నారు. బ్యాంక్‌ ఉద్యోగులకు మద్దతుగా.. సర్వీస్‌ ప్రొవైడర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా విధులకు దూరంగా ఉన్నారు. అయితే ఎటిఎంలలో నగరు చేరవేశామని ఎలాంటి ఇబ్బందులు రావని అంటున్నారు.