బ్యాలెట్‌ పేపర్లే మేలు: అఖిలేశ్‌

లక్నో,మే29(జ‌నం సాక్షి): ఇవిఎంల మొరాయింపు, సాంకేతకి లోపాలు, వివిధ రకాల ఆరోపణల నేపథ్యలంఓ మళ్లీ బ్యాలెట్‌ పత్రాల ఆవశ్యకత ఉందని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. సజావుగా ఎన్నికలు జరగాలంటే బ్యాలెట్‌ పత్రాలే మేలన్నారు. కైరానాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు భారీ స్థాయిలో మొరాయించినట్లు ఆరోపించారు. అందుకే రానున్న ఎన్నికల్లో అంతటా బ్యాలెట్‌ పేపర్లను వాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. అయితే ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో మళ్లీ ఓటింగ్‌కు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు అఖిలేశ్‌ తెలిపారు.  రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత లక్నోలో విూడియాతో మాట్లాడుతూ.. దేశంలో విపక్షాల ఐక్యతతో మోడీని గద్దెదింపుతామన్నారు. బిజెపికి చెక్‌ పెట్టక తప్పదన్నారు. ప్రజలు మోడీపట్ల భ్రమలు కోల్పోయారని అన్నారు.