బ్రిటిషర్లను గడగడ లాడిరచిన సైనికధీరుడతడు!

ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌పాండే

న్యూఢల్లీి,జూలై19(జనంసాక్షి): ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌ పాండే 1827 జులై 19న పుట్టాడు. మంగళ్‌ పాండే జయంతి సందర్భంగా ఆయన వీరోచిత పోరాటం అందరికీ స్నఫూర్తిదాయకం. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్‌ రెజిమెంట్‌ యందు ఒక సిపాయి. . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్‌ వారిపై యుద్దాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్‌ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్యాల్ర సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్‌ పాండేదేకోల్కతా దగ్గర బారక్‌ పూర్‌ వద్ద మార్చి 29, 1857, మద్యాహ్నం, ల్యూటినెంట్‌ బాగ్‌ వద్ద, బ్రిటిష్‌ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటిషు వారు సిపాయిలకు తుపాకులకు, ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసిన తయారు చేసిన తూటాలు ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి పైపొరను తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈ నేరంవిూద మంగళ్‌ పాండేను బ్రిటీష్‌ అధికారులు ఉరితీసారు.మంగల్‌ పాండే ఉత్తరప్రదేశ్‌ లోని ఫజియాబాద్‌ పట్టణం దగ్గరలో జన్మించాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇతనికి హిందూ ధర్మాలు, సంస్కృతి పట్ల అపార నమ్మకం ఉండేది. ఇతను పనిచేసే సైనికదళంలో కూడా బ్రాహ్మణులు అధిక సంఖ్యలో
ఉన్నారు. ఇతని గౌరవార్ధం భారతప్రభుత్వం 1984 సంవంత్సరంలో ఇతని ముఖచిత్రంతో తపాలాబిళ్లను విడుదల చేసింది. 2005లో ఇతని పేరువిూద సినిమాకూడా విడుదలైంది.మంగళ్‌ పాండే ధైర్యసాహసాల నుంచి నేటి యువత ప్రేరణ పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.