భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

99కాజీపేట: వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ రాకకు ముందే భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం 5లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10గంటల వరకు లక్షా 50వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. గద్దెల వద్ద భక్తులతో రద్దీగా ఉంది. దర్శనానికి 3గంటల సమయం పడుతుంది. గద్దెల వద్ద రద్దీక్రమేణా పెరుగుతుండటంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

మేడారానికి హోం శాఖమంత్రి
ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర హోం శాఖమంత్రి నాయిని నర్సింహరెడ్డి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.