భగత్‌సింగ్‌ మునిమనువడు రోడ్డు ప్రమాదంలో మృతి

1

సిమ్లా,మే29(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ మునిమనవడు అభితేజ్‌సింగ్‌(27) దుర్మరణం చెందారు. ఇవాళ ఆయన బైకు వెళ్తోండగా రామ్‌పూర్‌ సవిూపంలో మ్యాంగ్లడ్‌ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభితేజ్‌ తన స్నేహితుడితో కలిసి వెళ్తోండగా రోడ్డుపై తడి ఉండటంతో బైకు అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే అభితేజ్‌ను ఆయన మిత్రున్ని రామ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా కొద్ది నిమిషాల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టమ్‌ తర్వాత అబితేజ్‌ మృతదేహాన్ని అయన బంధువులకు అప్పగించారు. మొహాలిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.