భద్రతా ఏర్పాట్లపై పీసీబీ ఫుల్ హ్యాపీ
కోల్‌కత్తా, డిసెంబర్ 4:భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇవ్వబోయే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. పిసిబీ చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ గత రెండు రోజులుగా భారత్‌లో పర్యటిస్తోంది. పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడబోయే బెంగళూర్, కోల్‌కత్తా, చెన్నై, ఢిల్లీతో పాటు అహ్మదాబాద్ వేదికలను ఈ బృందం పరిశీలిస్తోంది. అలాగే ఆటగాళ్ళు బస చేసే ¬టల్స్‌తో పాటు సెక్యూరిటీపై పూర్తి పరిశీలన జరుపుతోంది. దీనిలో భాగంగా ఆయా నగరాల పోలీస్ కవిూషనర్లతో ప్రత్యేకంగా సమావేశం కూడా జరిపింది. భారత్‌లో తమ జట్టు ఏర్పాట్లపై పూర్తి సంతృప్తితో ఉన్నట్టు పిసిబీ తెలిపింది. ఏ విషయంలోనూ తమకు ఆందోళన లేదని స్పష్టం చేసింది. ఆరుగురు సభ్యుల కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకుండానే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే ఇప్పటికే కొన్ని వేదికలను పరిశీలించిన ఈ బృందం ఫోన్‌లో తమ బోర్డుకు వివరించినట్టు సమాచారం. భారత్‌లో పర్యటిస్తోన్న పిసిబీ బృందంలో సర్వార్ , పిసిబీ సెక్యూరిటీ డైరెక్టర్ ఎహ్‌సాన్ సిధ్ధికీ , పిసిబీ మేనేజర్ ఉస్మాన్ వల్హా కూడా ఉన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య దాదాపు మూడేళ్ళ తర్వాత ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. దీనిలో భాగంగా భారత్ రానున్న పాక్ జట్టు రెండు టీ ట్వంటీలు , మూడు వన్డేలు ఆడుతుంది. డిసెంబర్ 22న ఆ జట్టు భారత్‌లో అడుగుపెట్టనుండగా… తొలి టీ ట్వంటీ బెంగళూర్‌లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు ఇరు దేశాల ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా… పాక్ అభిమానుల కోసం ప్రత్యేకంగా వీసాలు ఇవ్వనున్నారు.