భద్రత లేకుండా భార్యతో కలిసి ఢిల్లీ సీఎం మార్నింగ్ వాక్
న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి): సంచలనాలకు మారు పేరైన అరవింద్ కేజ్రివాల్ మరో సంచలనానికి తెర తీశారు. దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటిలా, ఎలాంటి భద్రతా లేకుండా మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. భార్యతో కలిసి మార్నింగ్ వాక్‌కి వెళ్లిన కేజ్రీవాల్ ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఆయన నివాసానికి సమీపంలో వాకింగ్ చేస్తూ ఈరోజు ఉదయం ఆయన ప్రజలకు కనిపించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తాను ఆమ్ ఆద్మీనేనని ఆయన మరోసారి నిరూపించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించి శనివారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఆయన బుగ్గకారు , జెడ్‌ప్లస్ భద్రత తిరస్కరించారు.