భద్రాచలం అభివృద్ధికి పక్కా ప్రణాళిక

7

దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం

విద్యు.త్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): స్థపతులతో మాట్లాడి భద్రాచలాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని మించిన దేవాలయం తెలంగాణలోనే లేదని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. భద్రాచలం జగత్‌ విఖ్యాతం అవుతుందన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హావిూనిచ్చారు. తనకు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని విూద విశ్వాసం ఎక్కువ. రాష్ట్రంలోని శివాలయాలను, కాళేశ్వరం, అలంపూర్‌ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా భద్రాచలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని  కేసీఆర్‌ అన్నారు. ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడి గోదావరి తీరాన్ని సుందరగా తయారు చేస్తామని అన్నారు.  ఖమ్మం జిల్లా మణుగూరులో భద్రాద్రి విద్యుదుత్పాదన కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ భద్రాచలం ముఖ్యమైన పుణ్యక్షేత్రమని.. రామాలయం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాచలంలో గోదావరి నదీ తీరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పలుచోట్ల విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడం ద్వారా తెలంగాణకు 24 వేల మెగావాట్ల విద్యుత్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా మణుగూరులో భద్రాద్రి విద్యుదుత్పత్తి కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పూర్తికానున్న ఈ ప్లాంట్‌ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపే విద్యుత్‌ కొరతను అధిగమించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కోతలు ఉండవని,  పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్‌ కోతలు విధించలేదన్నారు.  భద్రాద్రి పవర్‌ప్లాంట్‌తో అందుబాటులోకి 1080 మెగావాట్ల విద్యుత్‌ రానుంది. తెలంగాణలో రూ. 91,500 కోట్లతో పవర్‌ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం. విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా 24 వేల మెగావాట్లు సిద్ధం చేస్తున్నాం. 2017 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉంటుంది. పని చేసే ప్రభుత్వముంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు డిజైన్‌ మారుస్తామని కూడా చెప్పారు. పక్కనే ఇంత పెద్ద గోదావరి ఉన్నా ఖమ్మం జిల్లాలో కరువు ఉండడం దురదృష్టకరం. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు.  ఐదారు రోజుల్లో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తా. మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటా. భద్రాచలం నుంచే పర్యటన ప్రారంభిస్తానని సీఎం పేర్కొన్నారు. భద్రాచలంలోని కొన్ని గ్రామాల విలీనంపై ప్రధాని మోడీతో మాట్లాడుతానని తెలిపారు. అవసరం లేకున్నా ఎటపాక, పురుషోత్తమపురం ప్రాంతాలను ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. ఆయా గ్రామాలపై ఏపీ సీఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నానని సీఎం చెప్పారు.