భద్రాచలం ఏజెన్సీలో అప్రమత్తం 

మావోల హత్యలతో నేతల్లో ఆందోళన
భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్‌24 (జ‌నంసాక్షి): ఉత్తరాంధ్రలో నక్‌స్ల్‌ కాల్పుల కలకలం రేపడంతో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంఓల మావోలు పంజా విసరడంతో ఇక్కడ కూడా ఎప్‌ఉడు ఎలాంటి ఉపద్రవం ముంచఉకొస్తుందో అని అందోళన చెందుతున్నారు. అసలే ఎన్నికల సమయం కావడంతో ఏజెన్సీలో అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.  కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యం ప్రాంతం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో ఉద్రిక్తంగా మారింది. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమును వాహనం అటకాయించి దారుణంగా హత్య చేశారు. గన్‌మెన్‌లను చెట్టుకు కట్టేసి వారి వద్ద ఉన్న ఆయుధాలను అపహరించుకుని వెళ్లారు. అరకు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోము తమ వాహనాల్లో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈక్రమంలో అరకు అటవీ ప్రాంతంలోని దుంబ్రీగూడ మండలం లివీపుట్‌ గ్రామంలో సర్వేశ్వరరావు, సోము వెళ్తుండగా 60మంది సాయుధులైన మావోయిస్టులు వాహనాలను అటకాయించారు.. వారి మధ్య అటవీప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది.. వారి మధ్య వాదోపవాదాలు జరిగి కోపోద్రిక్తులపైన మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెలే సోముపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వారి వెంట ఉన్న గన్‌మెన్‌లను బంధించి చెట్టుకు కట్టేశారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను అపహరించి పరారయ్యారు. అయితే పోలీసులు సైతం వారి ధాటికి తాళలేక సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కోరాపుట్‌ ఏరియా కమిటీకి చెందిన మావోయిసుట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.