భద్రాచలం చేరుకున్న గవర్నర్
ఖమ్మం: గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఐటీడీఏ పీవో వీరపాండ్యన్, ఎస్పీ రంగనాథ్ గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.