*భద్రాద్రిని మోసం చేస్తే పుట్టగతులు ఉండవు.
*5పంచాయతీల తెలంగాణ కు ఇచ్చేదాక కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు.
*రాచరిక పాలన లేకా ప్రజాస్వామ్య పాలన.
*దీక్షా శిబిరం లో కేంద్ర రాష్ట్ర .ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ కూనంనేని.
*దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య.
భద్రాచలం, ఫిబ్రవరి 3 (జనం సాక్షి): రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం ప్రాంతాన్ని అంధకారంలోకి నెట్టి కేంద్ర ప్రభుత్వము భద్రాచలం ప్రాంత ప్రజలతో చెలగాటమాడుతున్నారని భద్రాద్రి ప్రాంత ప్రజలను మోసం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో 5 పంచాయతీలపై తక్షణం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహారదీక్షను తొలుత సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునిల్ కుమార్ కు పూలమాల వేసి కూనంనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిని కేంద్రం రాష్ట్రం పూర్తిగా గాలికి వదిలేసి భద్రాద్రి ప్రాంత ప్రజలను బహిరంగంగా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రసాద్ ఫండ్స్ కింద నిధులు మంజూరు చేసి కేవలంగుడి మాత్రమే అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి కాదని అ విషయం భాజపా నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. సారపాక వరకు రైల్వే లైను, భద్రాచలాన్ని అనుకొని ఉన్న ఐదు పంచాయతీలు తెలంగాణ ఇవ్వడానికి కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పాలక పార్టీలను చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా రాచరిక పాలనలో ఉన్నామా. అనేది అర్థం కావటం లేదని అన్నారు.అనంతరం దీక్షా శిబిరాన్ని సందర్శించి
*భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం భద్రాద్రి ప్రజల మీద బాధ్యత లేదని అనేక మార్లు శాసనసభలో చర్చించిన పెడచెవిన పెట్టిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
*సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ భద్రాద్రి ప్రజల ఆవేదన పై ఐక్య పోరాటాలు అవసరమని జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి ప్రజల హక్కుల కొరకు. న్యాయమైన డిమాండ్ల కొరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు సిపిఐ శ్రీకారం చుడుతుందని అన్నారు.
ఈ దీక్షా శిబిరాన్ని సిపిఎం నాయకులు ఎంబీ నరసారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, వెంకటరెడ్డి, రేణుక, కాంగ్రెస్ నాయకులు సరేళ్ల నరేష్, తాండ్ర నరసింహారావు, బొగల శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు ఎస్కె అజీమ్, కుంచాల రాజారామ్, అబ్బినేని శ్రీను, ప్రజా సంఘాలు నాయకులు ముద్ద పిచ్చయ, దాసరి శేఖర్, అలవాల రాజా, పాలరాజ్ బిఎస్పి నాయకులు అర్దా వెంకటేశ్వరరావు, గురజాల వెంకటేశ్వర్లు, పౌర సమితి నాయకులు పోతుగుంట్ల సత్యనారాయణ, తదితరులు సందర్శించి మద్దతు తెలియజేశారు.
*ఏఐటియుసి పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్ అధ్యక్షత న నిర్విహించిన దీక్ష శిబిరం లో సిపిఐ నాయకులు బత్తుల నర్సింహులు, నోముల రామిరెడ్డి, లంకపల్లి విశ్వనాధ్, కల్లూరి శ్రీరాములు, రాజుదేవర నాగరాజు, ఏఐవైఎఫ్ నాయకులు కట్టా శివరాం, కొల్లిపాక శివ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మారెడ్డి గణేష్, ఇంద్ర కిలాద్రి, భాను ప్రకాశ్, మహిళ సమాఖ్య నాయకులు కోమరం లక్ష్మీ, వెంకటమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.