భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవం
ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ఈ ఉదయం వసంతోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కాసేపటిలో శ్రీసీతారామ చంద్రస్వామిని పురవీధుల్లో వూరేగించనున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన బ్రహ్మూెత్సవాలను 25న చక్రతీర్థంతో పూర్ణాహుతి పలికి ముగించనున్నారు. 26న స్వామికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉత్సవాల వల్ల ఆగిన నిత్య కల్యాణాలు 27 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.