భరోసా యాత్రకు బ్రహ్మరథం

* తెలంగాణలో ముఖం లేక బయటి రాష్ట్రాల్లో తిరుగుతున్న కెసిఆర్

* టిఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ

* రసమయికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు

* సబ్బండ వర్గాలను గోసపెడుతున్న కేసీఆర్

* ప్రజల గోసను తీర్చడమే బిజెపి భరోసా యాత్ర లక్ష్యం

* బిజెపి నేత , మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
బిజెపి చేపట్టిన భరోసా యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఈ యాత్రకు బిజెపి నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో
మానకొండూరు నియోజకవర్గ ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం జరిగింది. మానకొండూర్ చెరువు కట్ట వద్ద ఉన్న విఠలేశ్వరస్వామి దేవాలయం నుండి ప్రారంభించారు. నియోజకవర్గ బిజెపి శ్రేణులు బైక్ ర్యాలీ తో యాత్ర ప్రారంభించి, మానకొండూరు చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు .అనంతరం ర్యాలీ శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి,లింగాపూర్ వెల్ది,లక్ష్మీపూర్, వెగురుపల్లి, ఉటుర్, పచ్చునూర్, మద్దికుంట, పోచంపల్లి, కెల్లెడు రంగపేట గ్రామాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బిజెపి జెండా ఆవిష్కరణ, సమావేశాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిమాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీలేదు. తెలంగాణలో తిరగలేక పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీ అంటేనే తండ్రి కొడుకుల పార్టీ అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదని అనుకుంటే, కెసిఆర్ కు సెంటిమెంట్ జిల్లా అయినా కరీంనగర్ జిల్లాలో కూడా అభివృద్ధి జరగకపోవడం దురదృష్టకరం అన్నారు . తెలంగాణ సంపదను నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు కేవలం కుటుంబ సభ్యుల నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది అన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చుపెట్టి సాధించింది ఏమిటో కెసిఆర్ ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని, ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని దుయ్య బట్టారు .ముఖ్యంగా మానకొండూరు లోని హెడ్ క్వార్టర్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన రసమయి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకు కొట్లాడడం లేదు, మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు మానకొండూరు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు రసమయి నాటి తెలంగాణ ఉద్యమ కారుడి స్వభావాన్ని, ఉద్యమ సమయంలో కొట్లాడిన తీరును మరిచిపోయార అనే ప్రశ్నించారు కుటుంబ పార్టీ నీ ప్రశ్నించడానికి దమ్ము ,ధైర్యం చాలడం లేదా అని పేర్కొన్నారు ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదన్నారు. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గ కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయి విస్మరించడం దారుణం అన్నారు . మానకొండూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ మారుస్తామన్న అభివృద్ధి ఏమైంది నియోజకవర్గ కేంద్రానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేని దుస్థితి నెలకొంది అన్నారు హెడ్ క్వార్టర్ లో సెంట్రల్ లైటింగ్ లేని పరిస్థితిపై,వంద పడకల ఆసుపత్రి, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల హామీలను ఎమ్మెల్యే రసమయి విస్మరించడం దారుణమన్నారు. అలాగే మానకొండూరు నుండి అన్నారం వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిపివేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడితే ఎమ్మెల్యే రసమయి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు మానకొండూరు మండల కేంద్రం నుండి శ్రీనివాస నగర్, జగ్గయ్య పల్లె వరకు రోడ్డు నిర్మిస్తామన్న ఎమ్మెల్యే రసమయి ఇచ్చిన హామీ ఏమైందన్నారు . ఇక్కడి ప్రాంతంలో రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మానకొండూరు పరిధిలో స్మశాన వాటికలో నాణ్యత లోపం వల్ల నిర్మించిన కొన్ని రోజులకే కూలిపోయాయని, ఇక్కడి ప్రాంతంలో ఉపాధి లేక కరీంనగర్ పట్టణానికి ప్రజలు వలస వెళుతుంటే ఎమ్మెల్యే రసమయి ఏలాంటి అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు . ఎల్ఎండి ముంపు గ్రామం శ్రీనివాస్ నగర్ ప్రజానీకానికి ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడందారుణమైన విషయం అన్నారు . మానకొండూరులో సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యే రసమయి వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తే, ఉప ఎన్నిక ద్వారానైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంద…