*భవన నిర్మాణ కార్మికుల హక్కులకై పోరాడుదాం.
భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటియుసి పట్టణ మహాసభను జయప్రదం చేయండి.
ఫోటో రైట్ అప్ :1. సమావేశంలో మాట్లాడుతున్న బత్తుల నరసింహులు
భద్రాచలం, జూన్ 29 (జనం సాక్షి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడడం కొనసాగిద్దాం కార్మికుల సమస్యలు పరిష్కారానికై జూలై 1వ తేదీన జరిగే భద్రాచలం పట్టణ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటియుసి అనుబంధం మహాసభను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల నరసింహులు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బత్తుల నరసింహులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అన్ని రంగాల కన్నా భవన నిర్మాణ కుదేలు పడిందని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు అదేవిధంగా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఇసుక బంగారం కన్నా ఎక్కువ రేట్లు లభిస్తుందని భద్రాచలం పట్టణానికి ఇసుక కొరత ఉందని దీనివల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా పనులు లేక నష్టపోతుందని అన్నారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాని కై జులై 1న జరిగే మహాసభ కు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు మా రెడ్డి శివాజీ, డి.శివ ప్రసాద్, సత్యనారాయణ, రామారావు, రమేష్ , శోభన్ తదితరులు పాల్గొన్నారు.