భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా రెండవ మహా సభలను జయప్రదం చేయాలి.
నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.ఈనెల 27న హుజూర్ నగర్ పట్టణంలో జరుగు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని,నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, జిల్లా సహాయ కార్యదర్శి గుంజ రవీందర్ లు కోరారు. శుక్రవారం నాడు పట్టణ కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల తో కలిసి కరపత్రాలు విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నిర్మాణ రంగాన్నే నమ్ముకుని అత్యధిక కార్మికులు జీవిస్తున్నారని,ఇటీవల కరోనా పరిస్థితుల వలన తీవ్ర సంక్షోభం సంభవించిందని,ఫలితంగా నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలు భారీగా పెంచడంతో, మధ్య చిన్నస్థాయి బిల్డర్లు నిర్మాణం చేపట్టడం మానేశారని, దీంతో నిర్మాణరంగ కార్మికులు పనులు కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణరంగ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు వెల్ఫేర్ బోర్డు లోని నిధుల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న క్లైమ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మట్టయ్య,ఎర్ర ఖాజావలి,చిన్న ఖాజావలి,బిక్షం,రహీం తుల్లా,రామారావు,అంజి, నాగూర్, లతీఫ్,నమ్మకం, కరీముల్లా, శ్రీను, నాగరాజు, రామకృష్ణ, శివ,జానీ, జానకి రాములు, వెంకన్న, మోహన్ రావు,తిరుపమ్మ తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.