భవిష్యత్తులో సౌరవిద్యుతే సర్వం

5

-ప్రధాని నరేంద్ర మోడీ

-సాంప్రదాయేతర ఇంధన వినియోగంలో  తెలంగాణ బెస్ట్‌

– అవార్డు అందుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి

న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):

దేశాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ వనరులను ప్రోత్సహిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. వరల్డ్‌ రి ప్రొడ్యుసింగ్‌ డే సందర్భంగా ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశంలో విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు సోలార్‌ పవర్‌ పై దృష్టి పెట్టాలని చెప్పారు. భవిష్యత్‌ లో భారత్‌ సోలార్‌ పవర్‌ పై మరింత దృష్టి పెడుతుందన్నారు. ఇక భారత్‌ లో అపారమైన మానవ వనరులున్నాయని వీటిని?పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.కాగా విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రధానమంత్రి సరేంద్ర మోడి అభిసందించారు. విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వపు నూతస ఆవిష్కరణలసు ,ఆలోచనా విధానాన్ని ,అనుసరిస్తున్న మార్గాలను స్వాగతించారు. న్యూ అండ్‌ రినీవబుల్‌ ఎనర్జీ (నూతన, సాంప్రదాయేతర ఇంధనం) ఇన్వెస్టర్‌ సదస్సులో ప్రధానమంత్రి తెలంగాణ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 13వ ఆర్దిక సంఘం నిధులతొ రంగాన్ని తీర్చిదిద్దంలో తెలంగాలోని పది జిల్లాలు మంచి ఫలితాలు సాదించాయన్నారు.దేశంలో మెరుగైన ఫలితాలు సాధించిన 12 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా  ఉండడం అభినందనీయమన్నారు. గతకొద్ది నెలలుగా సౌర విద్యుత్‌ త ోపాటు నూతన ,సాంప్రదాయేతర ఇంధన వనరులను అమలులోకి తెచ్చినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అవార్డు అదించారు. విద్యుత్‌  శాఖ మంత్రి జి.జగదీష్‌ రెడ్డి ,ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్‌ ఈ అవార్డు అందుకున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాలను ప్రధాని అభినందిచడం వల్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రశంస తమకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.