భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రేపటి తరం కోసం ఎన్నో పనులను చేశాం.

ఆహ్లాదకరమైన వాతావరణ కేంద్రం గా అమ్మ చెరువు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మంత్రి సమక్షంలో బిఅరెస్ చేరిన భాజపా నాయకులు

వనపర్తి బ్యూరో అక్టోబర్ 29 (జనంసాక్షి)

రేపటి తరం కోసం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎన్నో పనులను చేసి మీ ముందర పెట్టమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆదివారం బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రి సమక్షంలో బిఅరెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజనగరం చెరువు పనులను పావు వంతు చేయడం జరిగిందని, మిగిలిన సుందరికరణ పూర్తి ఐతే చాలా అద్భుతంగా ఉంటుందన్నారు.వనపర్తి పట్టణంలోని మురికి నీళ్లు మొత్తం రాజనగరం చెరువులోకి వస్తుందని, దీనివల్ల పంటలు అన్ని విషతుల్యం అవుతు ఆహారం తీసుకున్న వారు సైతం రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని,అందుకోసం ట్రీట్మెంట్ ప్లాట్ 2 ఒకటి నల్ల చెరువు నుండి వచ్చే నీరు , పట్టణం నుండి వచ్చే మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ చేయడం వల్ల నీరు శుద్ధజలం గా అవుతుంది. ఇందుకోసం గతంలోనే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు.ఎవరు కలగనని విధంగా ,ఆహ్లాదకరమైన వాతావరణం కు కేంద్రం గా అమ్మ చెరువు ను తయారు అవుతుందన్నారు.
జిల్లా కేంద్రం అయిన తరువాత అన్ని రకాల వసతులు కల్పించడం వల్ల ఎన్నో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు వస్తున్నాయని,
మనిషి కి పని చేసి బ్రతుకు దెరువుపై ఆలోచన ఉండాలని, పని చేయాలి ఉన్నతంగా ఎదగాలన్న విశ్వసనీయత కల్గి ఉండాలన్నారు.
మీరు మీ పనులు చేసుకుంటునే సమయం దొరికినప్పుడల్లా పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలోని12 వ వార్డు కౌన్సిలర్ అలివేల గోపాల్ , జిల్లా గొర్రెల కాపురుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ ల ఆధ్వర్యంలో రాజనగరం కు చెందిన 30 మంది , అదేవిధంగా ఖిల్లా ఘనపురం పర్వతపూర్ గ్రామానికి చెందిన 15 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ కుమార్ యాదవ్ చేరిక.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ కుమార్ యాదవ్ తో పాటు 10 మంది బిజెపి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఏస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ , జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ , సీనియర్ నాయకులు రాములు యాదవ్ , సింగిల్ విండో చైర్మన్లు రఘు వర్ధన్ రెడ్డి , మధుసూదన్ రెడ్డి మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము గారు తదితరులు పాల్గొన్నారు