భాగ్యనగరాన్ని మురికి కూపంలా మార్చేస్తున్నారు. : తెదేపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భాగ్యనగరాన్ని మురికికూపంలా మార్చేస్తున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి ఆయన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళాలాడిన హైదరాబాద్‌లో ప్రస్తుతం అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.