భాజపా కార్యాలయానికి మోదీ శంకుస్థాపన

1

ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):శ్రావణ పౌర్ణిమ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నూతన భవనానికి గురువారం ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ పార్టీ పరంగా ఇదో ముందడుగన్నారు. బిజెపి కార్యాలయ భవనాన్ని అధునాతనంగా నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో దీనిని నిర్మించనున్నారు. ఇదే సందర్బంలో రాఖీ సందర్బంగా పలువురుప్రధాని మోడీకి రాఖీ కట్టారు. భూమి పూజు సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

2018 నాటికి బిజెపికి కొత్త కార్యాలయం: అమిత్‌ షా

వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టనుంది. శంకుస్థాపన సందర్భంగా  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2018 డిసెంబర్‌ నాటికి కొత్త కార్యాలయం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 25న మాజీ ప్రధాని తమ పార్టీ సీనియర్‌ నేత, గురు సమానులు అటల్‌ బిహారీ వాజ్‌ పేయి పుట్టిన రోజున ఈ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ఏడు అంతస్థుల్లో నిర్మించే ఈ భవనంలో మొత్తం 70 గదులు ఉంటాయని, మూడు సమావేశ మందిరాలు ఉంటాయని వివరించారు. మొత్తం భవనమంతా వైపై సౌకర్యం అందుబాటులో ఉండనుంది. అలాగే సౌర విద్యుత్‌ ఏర్పాటు, డిజిటల్‌ లైబ్రరీ ఉంటుంది. 150 కార్లు అండర్‌ గ్రౌండ్‌ లో పార్క్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఢిల్లీలోని అశోక రోడ్డులో బ్లాక్‌ బెర్రీ మొక్కల మధ్య అలరారుతున్న తన పార్టీ కార్యాలయం స్థానంలో కొత్త కార్యాలయం రానుంది. అది కూడా వచ్చే ఏడాది చివరినాటికి డెడ్‌ లైన్‌ గా పెట్టుకుంది. ఈ కార్యాలయ స్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీనేతలు కార్యకర్తలు దీనికి హాజరయ్యారు.