భారతజట్టులో స్వల్పమార్పు

జ్వరంతో బాధపడుతున్న హర్బజన్‌సింగ్‌ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో జట్టులోకి ఇషాంత్‌శర్మ వచ్చాడు.

భారత జట్టులో..

గంబీర్‌, సెహ్వాగ్‌, పూజారా, సచిన్‌, విరాట్‌కోహ్లి, యువరాజ్‌సింగ్‌, ధోని, అశ్విన్‌, జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌శర్మ,  ఓజా.

100వ టెస్టు ఎప్పుడో..

హర్బజన్‌ 100వ టెస్టు కోసం ఆయన అభిమా నులు ఎదురు చూస్తున్నారు. ఆ టెస్టు అతని కెరీర ్‌లో మైలు రాయిగా నిలవాలన్న ఆశాభావాన్ని వ్య క్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా జ్వరంతో బాధప డుతున్న హర్బజన్‌సింగ్‌ మూడో టెస్టులో పాల్గొన డం లేదు. అతని స్థానంలో ఇషాంత్‌శర్మ ఆడుతు న్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా హర్బజ న్‌ జ్వరంతో బాధపడు తున్నాడు. మంగళవారం నాటి నెట్‌ ప్రాక్టీస్‌లోనూ పాల్గొనలేదు. హోటల్‌ గదికే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా కోల్‌కతా టెస్టులో హర్బజన్‌ ఆడితే అది అతని కెరీర్‌లో 100వ టెస్టు అవుతుంది.

హర్బజన్‌ కెరీర్‌ ఇలా..

హర్బజన్‌సింగ్‌ కుడిచేతి బ్యాట్స్‌మెన్‌. బౌలింగ్‌ శైలి.. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌. టెస్టు ఆరంగేట్రం.. 1998, మార్చి 25. వన్డే ఆరంగేట్రం.. 1998, ఏప్రిల్‌ 17. టి-20 ఆరంగేట్రం.. 2006, డిసెం బర్‌ 1. ఐపిఎల్‌ ఆరంగేట్రం.. 2008, ఏప్రిల్‌ 20. ఇదిలా ఉండగా 98 టెస్టుల్లో 138 ఇన్నింగ్స్‌ ఆడాడు. 2,165 పరుగులు సాధించాడు. అతని టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరు 115 పరుగులు. టెస్టుల్లో 2 సెంచరీలు.. 9 అర్ధసెంచరీలు మాత్ర మే ఉన్నాయి. అలాగే వన్డేల్లో 229 మ్యాచ్‌లు ఆడాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో పాలుపంచుకున్నాడు. 1190 పరుగులు నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 49 పరుగులు. సెంచరీలు, అర్ధసెంచరీలు లేవు. అదేవిధంగా 20-20లలో.. 23 మ్యాచ్‌లు ఆడాడు. 100 రన్‌లు సాధిం చాడు. అతని అత్యధిక స్కోరు 21 పరుగులు.  అలాగే ఐపిఎల్‌లో 63 మ్యాచ్‌లు ఆడాడు. 428 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 49 పరుగులు.

వికెట్లు ఇలా..

98 టెస్టు మ్యాచ్‌ల్లో 180 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేశాడు. 406 వికెట్లు తీసుకున్నాడు. అలాగే వన్డేల్లో.. 230 మ్యాచ్‌లు ఆడి 261 వికెట్లు తన , 20-20లలో.. 23 మ్యాచ్‌లు ఆడాడు. 18 వికె ట్లు తీశాడు. ఐపిఎల్‌లో 63 మ్యాచ్‌ల్లో ఆడాడు. అయితే 61 ఇన్నింగ్స్‌ల్లోనే పాలుపంచుకున్నాడు. 54 వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు.