భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి .
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి .
భువనగిరి టౌన్ (జనం సాక్షి):-+
యాదాద్రి భువనగిరి జిల్లా బోనగిరి పట్టణం స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద టిపిసిసి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ యుద్దీన్ గౌరీ, మాజీ బోర్డు సభ్యులు మొహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో స్వర్గీయ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి.భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారు. ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం మొహిద్దీన్ ఖైరుద్దీన్. చిన్ననాటనే అరబిక్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ భాషలలో ఆజాద్ మంచి పాండిత్యం సంపాదించారు. ఆయన తన 12వ ఏట ‘నైరంగ్-ఎ-ఆలం’ పత్రికను వెలువరించారు. ఆయన 13వ ఏటన అద్భుత సాహిత్య విమర్శను సృజియించి ‘విద్యాగని, సలక్షణ శోభితుడు, మహాకవి, సాటిలేని విద్వాంసుడు’గా ప్రశంసలందుకున్…మౌలానా అబుల్ కలామ్ ఆజాద్,భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, దేశంలో తొలి IIT నీ స్థాపించి దేశ యువతకు బంగారు బాటను వేసిన విద్యావేత్త ఆజాద్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోనగిరి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు , ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ layeeq అహ్మద్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ బాబా. సేవాదళ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ వజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మజార్, రిజ్వాన్, సిరాజ్, అంగడి నాగరాజ్, మొహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ జలీల్ మైనార్టీ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు..