భారతీయతే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక

ఫజల్‌ అలీ.. రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ మొదటి కమిటీకి చైర్మన్‌. 1953లో ఫజల్‌ అలీ అధ్యక్షతన కవలమ్‌ మాధవ ఫణిక్కర్‌, హెచ్‌.జె. కుంజు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన భారత్‌లో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ఫజల్‌ అలీ నేతృత్వంలోని కమిషన్‌ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. ప్రస్తుతం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెబుతున్నట్లుగా భాషా ప్రయొక్త రాష్ట్రాల ఏర్పాటును ఈ కమిషన్‌ సమర్దించలేదు. రాష్ట్రాల ఏర్పాటుకు భాష ప్రాతిపదిక కాదరని ఫజల్‌ అలీ, ఆయన కమిషన్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండటం వల్ల జాతీయ భావం పెంపొందుతుందని కమిషన్‌ నొక్కి చెప్పింది. రాష్ట్రాల ఏర్పాటుకు భారతీయతే ప్రాతిపదిక కావాలే తప్ప భాష కారాదని పేర్కొంది. కమిషన్‌ 1955 సెప్టెంబర్‌ 30న తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా, లోక్‌సభ అదే యేడాది డిసెంబర్‌ 14న  ఆమోదించింది. 1956లో కమిషన్‌ నివేదిక అమలుకు కేంద్రం పూనుకుంది. అప్పటికే వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్ర, హైదరాబాద్‌ను కలిపి అదే యేడాది నవంబర్‌ ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ స్టేట్‌లోని మెజార్టీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని ఫజల్‌ అలీ కమిషన్‌ తేల్చి చెప్పింది. అయితే ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి వేరుబడిన ఆంధ్ర ప్రాంత నేతలు అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌నెహ్రూతో మంత్రాంగం నడిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేయించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆంధ్రను సూచించే పదం మొదటనే ఉండగా తెలంగాణ మాత్రం పత్తాలేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ తన సహజ లక్షణాన్ని ప్రదర్శించి హిందీ పదాన్ని తీసుకొచ్చి పదం ప్రదేశ్‌ను చేర్చారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సీమాంధ్రులు తెలంగాణ వారిపై అన్ని విధాలుగా ఆధిపత్యం చెలాయించారు. ఫజల్‌ అలీ చెప్పని భాషా ప్రయోక్త రాష్ట్రాలు అనే అంశాన్ని మనపై రుద్ది నిలువు దోపిడీ చేశారు. ఇక్కడి నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలను యథేచ్ఛగా కొళ్లగొట్టారు. బలవతంగా తెలుగు భాషను అధికార భాషగా రుద్ది అప్పటి వరుకు ఉర్దూ చదివిన వారిని నిరుద్యోగులుగా మార్చేశారు. హైకోర్టులో అధికారభాషగా ఉర్దూకు స్థానం లేకుండా చేశారు. ఫలితంగా ఒక తరం ఉద్యోగావకాశాలు కోల్పోయింది. ఇది మనపై బలవంతంగా రుద్ద బడిన భాషాప్రయోక్త రాష్ట్రాల పుణ్యమే. హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్నో ఉన్నా దానిని తొక్కిపెట్టి తెలుగు మాట్లాడేవారంతా ఒకే రా

ష్టం ఉండాలని చెబుతూ బలవంతంగా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సీమాంధ్రతో ముడిపెట్టారు. దాని ప్రతిఫలాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. సర్వం కోల్పోయి ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసం ఉద్యమ బాట పట్టారు. ఒకే భాష మాట్లాడేవారంటూ కలగలిపిన వారు తెలంగాణ భాషను అన్ని విధాలుగా అపహాస్యం చేశారు. సినిమాల్లో విలన్లకు, ప్రసారమాధ్యమాల్లో ప్రతినాయకులకు, ఇటీవల కాలంలో ప్రతి నాయికలకు ఈ భాషను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం ఉద్యమిస్తున్న తరుణంలోనే సీమాంధ్రల దురాగతాలు ఇలా ఉంటే ఇంతకు ముందు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. బలవంతపు పెళ్లి చేస్తున్నట్లు అప్పుడే చెప్పిన నెహ్రూ అదే రోజు విడాకుల మంత్రం కూడా చెప్పాడు. ఇంత వరకు దానిని ముందుకు రానివ్వని సీమాంధ్ర శక్తులు తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ-2 ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణం మళ్లీ భాషాప్రయోక్త రాష్ట్రాల పాట పాడుతోంది.