భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం గాంధారి
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో తెలంగాణ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కిసాన్,SC St మోర్చాల మరియు మండల పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్యతిధిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు గుజరాత్ బావునగర్ MP శ్రీమతి భారతి బెన్షియల్ గారు ముఖ్యఅతిథిగా రావడం జరిగింది
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీకి మూడుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడల్లా ఈ దేశంలో అణగారిన వర్గాలను అట్టడుగు వర్గాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఒకసారి APJ అబ్దుల్ కలాం ని, మరొకసారి దళిత వర్గానికి చెందిన శ్రీ రామ్నాథ్ కోవింద్ ని, మరి ఇప్పుడు గిరిజన వర్గానికి చెందినటువంటి మహిళ మాతృమూర్తి శ్రీమతి ద్రౌపదిముర్ము ని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అని వారు అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇస్తున్నటువంటి దళిత బంధు టిఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళిత బిడ్డలకు దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కిసాన్, SC, ST మోర్చల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు సాయిబాబ,పోతాంగల్ కిషన్ రావు,సీనియర్ నాయకులు అంజాద్ ఖాన్, గండిపేట్ పెద్ది కాశీరాం మోజిరాం నాయక్, కట్రోథ్ రవి,కిస్టయ్య,అధికార ప్రతినిధి జువ్వాడి శ్రీకాంత్,ప్రభాకర్, సాయగౌడ్, వాసు,రామారావు, నేనవత్ గంగారాం,సుమన్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరూ