భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం

జనంసాక్షి  / రాజంపేట్
మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా తాము సైతం భాగస్వామ్యం అవుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఎంపీడీవో బాలకిషన్ గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య  సొసైటీ వైస్ చైర్మన్  అందాల రమేష్ మాజీ ఉప సర్పంచ్ ఆముద నాగరాజ్ ఎస్బిఐ సిబ్బంది జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు
Attachments area