‘భారత్‌కు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు’

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళం పటిష్ఠంగా ఉందని, ఆ జట్టు పూర్తిగా స్పిన్‌ పిచ్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవుతాయని చెప్పాడు.