భారత్, ఆఫ్ఘన్ ఫ్రెండ్‌షిప్ డ్యాం ప్రారంభం
హెరాత్,జూన్ 4(జనంసాక్షి):భారత్, అఫ్ఘానిస్థాన్‌ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్‌ను ప్రారంభించారు. హెరాత్‌లో శనివారం
జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలసి ఆవిష్కరించారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ
సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో కాబుల్లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ
కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఈ డ్యామ్‌ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్‌తో
పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా శనివారం మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో కాబుల్లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఈ డ్యామ్‌ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఇరు దేశాల బంధం మరింత ధృడపడిందని అన్నారు. అఫ్ఘన్ అభివృద్దికి భారత్ సహ కరాం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని అఫ్ఘానిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని శనివారం ఆయనకు ఆమిర్ అమానుల్లా ఖాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ‘నిజమైన సోదరభావానికి లభించిన గౌరవం ఇది. అఫ్ఘానిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆమిర్ అమానుల్లా ఖాన్ అవార్డు ప్రధానికి లభించింది’ అని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రధాని మోదీ అవార్డు అందుకుంటున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్‌తో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.