భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో రెన్‌షా, స్మిత్‌ ఔట్‌

eshanth
రాంచీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో ఆసీస్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. స్మిత్‌-రెన్‌షా జోడీకి ఇషాంత్‌ తెరదించాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో రెన్‌షా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్‌ కూడా ఔటవ్వడంతో భారత ఆటగాళ్లు సంబరాలు జరపుకున్నారు.

ఈ నేపథ్యంలో 29వ ఓవర్లో కొంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. 29వ ఓవర్లో తొలి బంతి వేసేందుకు ఇషాంత్‌ రాగా చివరి క్షణంలో రెన్‌షా క్రీజు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇషాంత్‌కు కోపం రావడంతో చేతిలోని బంతిని వికెట్లకు సమీపంలో విసిరాడు. దీన్ని చూసిన రెన్‌షా నవ్వూతూ కనిపించాడు. ఈ క్రమంలో అంపైర్‌… భారత సారథి కోహ్లీని పిలిచి మాట్లాడాడు. ఆ తర్వాతి వేసిన ఇషాంత్‌ వేసిన రెండు బంతుల్ని ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడిన రెన్‌షా నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.
జడేజాకు చిక్కిన స్మిత్‌
ఆ తర్వాతి ఓవర్లోనే ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ కూడా ఔటవ్వడంతో కంగారూలు కష్టాల్లో పడ్డారు. 30వ ఓవర్లో జడేజా వేసిన తొలి బంతిని ఎదుర్కొనే క్రమంలో స్మిత్‌(21) బౌల్డయ్యాడు. స్మిత్‌ ఔటవ్వడంతో భారత ఆటగాళ్లలో ఆనందం వెల్లివెరిసింది. 32ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 65పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్‌(6), హ్యాండ్స్‌కాంబ్‌ ఉన్నారు. ఆసీస్‌ ఇంకా 87పరుగుల వెనుకంజలో ఉంది.